Adipurush: ప్రభాస్ సినిమాకు కొత్త రిలీజ్ డేట్

Monday,November 07,2022 - 01:51 by Z_CLU

Prabhas’s Adipurush to release on June 16

సంక్రాంతి కోసం ముందుగా డేట్ ఎనౌన్స్ చేసిన సినిమా ఆదిపురుష్ (Adipurush). ఇప్పుడు అదే సంక్రాంతి బరి నుంచి ముందుగా తప్పుకుంటున్న సినిమా కూడా ఇదే. అవును.. ఆదిపురుష్ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. నిన్నటివరకు ఇది రూమర్. కానీ ఇప్పుడు మాత్రం ఇది అధికారికం. ఆదిపురుష్ సినిమాకు కొత్త విడుదల తేదీ ప్రకటించారు.

adipurush

జనవరి 12న రిలీజ్ అవ్వాల్సిన ఆదిపురుష్ సినిమాను జూన్ 16కు వాయిదా వేశారు (Adipurush Release Date). ఈ మేరకు దర్శకుడు ఓం రౌత్ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చింది. ప్రేక్షకులకు పూర్తి స్థాయి విజువల్ అనుభూతిని అందించేందుకు, యూనిట్ కు మరింత సమయం అవసరం అవుతుందని, అందుకే ఆదిపురుష్ సినిమాను సంక్రాంతి నుంచి సమ్మర్ కు వాయిదా వేసినట్టు ప్రకటించాడు డైరక్టర్.

adipurush

రామాయణ ఇతిహాసానికి దృశ్యకావ్యమే ఆదిపురుష్. ఇందులో రాముడిగా ప్రభాస్ (Prabhas), సీతగా కృతి సనన్ (Krithi Sanon), లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన టీజర్ లో హనుమంతుడితో పాటు మరికొన్ని పాత్రల దుస్తులపై విమర్శలు చెలరేగాయి. రావణుడి వాహనంపై కూడా చర్చ జరిగింది.

adipurush

దీంతో ఆదిపురుష్ గ్రాఫిక్స్ ను మళ్లీ మారుస్తున్నారు. అందువల్లే సినిమా విడుదల వాయిదా పడినట్టు ఇన్ సైడ్ టాక్. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది ఆదిపురుష్ మూవీ.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics