Prabhas వాయిదా పడనున్న 'ఆది పురుష్' ?

Monday,October 31,2022 - 01:33 by Z_CLU

Prabhas’s ‘Adipurush’ postponed to summer 2023

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో  మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ వచ్చే సంక్రాంతి కి రిలీజ్ అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేసి మేకర్స్ ప్రమోషన్ మొదలు పెట్టారు. అయోధ్యలో భారీ ఎత్తున జరిగిన ఈవెంట్ లో టీజర్ లాంచ్ చేశారు. అలాగే హైదరాబాద్  లో కూడా ఈవెంట్ ఏర్పాటు చేసి 3d టీజర్ రిలీజ్ చేశారు.

తాజా సమచారం మేరకు ‘ఆదిపురుష్’ వాయిదా పడిందని తెలుస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఇంకా పెండింగ్ ఉన్నందున, వచ్చే సంక్రాంతికి సినిమా థియేటర్స్ కి వచ్చే అవకాశం లేదని సమ్మర్ కి వాయిదా పడనుందని అంటున్నారు. ప్రస్తుతానికి మేకర్స్ నుండి పోస్ట్ పోన్ గురించి ఎలాంటి క్లారిటీ లేదు. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics