ప్రభాస్ ఫిక్స్ అయ్యాడు....

Tuesday,March 28,2017 - 09:30 by Z_CLU

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ బాహుబలి కోసం దాదాపు 4 ఏళ్లకు పైగా కేటాయించిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇక పై జెట్ స్పీడ్ తో సినిమాలు చేసి ఫాన్స్ ఎంటర్టైన్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు. ఇటీవలే బాహుబలి షూటింగ్ పూర్తి చేసి సుజీత్ డైరెక్షన్ లో చేయబోయే నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసిన ప్రభాస్ ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా సెట్స్ పై పెట్టాలని భావిస్తున్నాడు.

ప్రెజెంట్ బాహుబలి ప్రమోషన్ కోసం నెక్స్ట్ సినిమా షెడ్యూల్ ను పోస్ట్ పోన్ చేసిన ప్రభాస్   త్వరలోనే ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురావాలని  ఫిక్స్ అయ్యాడు. లేటెస్ట్ గా బాహుబలి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఇక పై ఏడాది కి రెండు సినిమాలు చేస్తానని ఫాన్స్ కి మాటిచ్చిన ప్రభాస్ ఆ మాట ను నిలబెట్టుకోవాలని చూస్తున్నాడు. సో  ఈ ఇయర్ సుజిత్ సినిమాతో పాటు రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాను కూడా సెట్స్ పెట్టేస్తాడన్నమాట ప్రభాస్..