ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్

Tuesday,July 25,2017 - 10:06 by Z_CLU

ఇటీవలే బాహుబలి తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రభాస్ ప్రెజెంట్ ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ తో రెండు సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే సుజీత్ డైరెక్షన్ లో ‘సాహో’ సినిమాను సెట్స్ పై పెట్టేసిన ప్రభాస్ త్వరలోనే రాధా కృష్ణ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు.


బాహుబలి తర్వాత సుజీత్ తో సాహో సినిమాను స్టార్ట్ చేసిన యంగ్ రెబెల్ స్టార్ ఈ సినిమాతో నెక్స్ట్ ఇయర్ థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ-ప్రమోద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాతో తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో మరో భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు ప్రభాస్.


సుజీత్ తో చేస్తున్న ‘సాహో’ తో పాటే రాధా కృష్ణ తో చేయబోయే సినిమాను సెట్స్ పై పెట్టడానికి రెడీ అవుతున్నాడు యంగ్ రెబెల్ స్టార్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా గోపి కృష్ణ బ్యానర్ పై కృష్ణంరాజు నిర్మాణంలో తెరకెక్కనుంది. లవ్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాను దీపావళి కి స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్ . ఈ రెండు సినిమాలు  పూర్తయ్యాకే మరో డైరెక్టర్ కి తన డైరీ లో చోటివ్వాలని డిసైడ్ అయ్యాడు యంగ్ రెబెల్ స్టార్ .