సాహో – ప్రభాస్ కి కూడా కొత్తే!

Wednesday,August 14,2019 - 11:02 by Z_CLU

‘సాహో’ సినిమా తెరకెక్కించే ప్రాసెస్ లో చాలా నేర్చుకున్నాను అని చెప్పుకున్నాడు దర్శకుడు సుజిత్. అయితే ప్యాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ కూడా ‘సాహో’ కోసం ఫస్ట్ టైమ్ కొన్ని డెసిషన్స్ తీసుకున్నాడు… దానివల్ల ప్రభాస్ మరింత స్పెషల్ అనిపించుకున్నాడు.

పోలీస్ ఆఫీసర్ రోల్ : ఇప్పటి వరకు కనీసం పోలీసాఫీసర్ యూనిఫామ్ కూడా వేసుకోలేదు ప్రభాస్ ఆన్ స్క్రీన్ పై. అలాంటిది ‘సాహో’ లో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. వాజీ సిటీలో మిలియన్స్ వాల్యూ చేసే బ్లాక్ బాక్స్ చుట్టూ తిరిగే ఈ కథలో… గ్యాంగ్ స్టర్స్ ని క్లోజ్ చేసే సీరియస్ ఆపరేషన్ ని లీడ్ చేసే ఆఫీసర్ లా కనిపించబోతున్నాడు.

హిందీ డబ్బింగ్ : 4 భాషల్లో రిలీజవుతున్న ఈ సినిమాకి హిందీ డబ్బింగ్ ప్రభాసే చెప్పుకున్నాడు. ఇలా హిందీలో డబ్బింగ్ చెప్పుకోవడం ప్రభాస్ కు ఇదే ఫస్ట్ టైమ్.

హాలీవుడ్ టెక్నీషియన్స్: ఇంతకుముందు బాహుబలి సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్ తో పనిచేశాడు ప్రభాస్. కానీ అది సినిమాలో కొంత మేరకే. కానీ సాహో కోసం మాత్రం ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ట్రావెల్ చేశాడు. దుబాయ్ లో తీసిన మోస్ట్ ఎవెయిటింగ్ యాక్షన్ ఎపిసోడ్ మొత్తం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కనుసన్నల్లోనే జరిగిన విషయం తెలిసిందే.