సైరాకు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రభాస్?

Tuesday,September 24,2019 - 05:15 by Z_CLU

సాహో ప్రమోషన్ లో భాగంగా రెస్ట్ లేకుండా గడిపాడు ప్రభాస్. లోకల్ మీడియా నుంచి నేషనల్ లెవెల్ వరకు ఎన్నో ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. మరెన్నో టెలివిజన్ షోజ్ లో పాల్గొన్నాడు. అలా ఎంతోమందికి ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రభాస్, ఇప్పుడు తనే స్వయంగా యాంకర్ గా మారబోతున్నాడు.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే చిరంజీవి, రామ్ చరణ్ ను కలిపి ఇంటర్వ్యూ చేయబోతున్నాడు యంగ్ రెబల్ స్టార్. సైరా సినిమా ప్రచారంలో భాగంగా ప్రభాస్ ఇలా యాంకర్ అవతారం ఎత్తబోతున్నాడు. ప్రస్తుతానికైతే ప్రభాస్ ఓకే చెప్పాడు. ఆ ఇంటర్వ్యూను ఎలా డిజైన్ చేయాలనే ఆలోచనలో యూనిట్ ఉంది.

బాహుబలి, సాహో సినిమాలతో జాతీయస్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు ప్రభాస్. మరీ ముఖ్యంగా రీసెంట్ గా వచ్చిన సాహో సినిమా హిందీలో సూపర్ హిట్ అయింది. ఇలాంటి హీరోతో ఇంటర్వ్యూ అంటే, నార్త్ లో కచ్చితంగా సైరాకు అది ప్లస్ అవుతుంది. చరణ్-ప్రభాస్ మంచి ఫ్రెండ్స్ కూడా కావడంతో ఈ కాంబినేషన్ వర్కవుట్ అయింది.