HotTopic: మరోసారి తెరపైకి ప్రభాస్ సినిమా?

Wednesday,August 12,2020 - 12:56 by Z_CLU

KGF గ్రాండ్ సక్సెస్ తర్వాత లెక్కప్రకారం, ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేయాలి. అప్పట్లో వీళ్లిద్దరి కాంబినేషన్ పై జోరుగా చర్చ సాగింది. కానీ ఎందుకో ఆ తర్వాత Prabhas పేరు వినిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు మరోసారి ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ తెరపైకి వచ్చింది.

గతంలో ప్రశాంత్ తీసిన ఉగ్రమ్ సినిమా లైన్స్ లో ఈ కొత్త సినిమా ఉండొచ్చు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి Prashanth-Prabhas మధ్య స్టోరీ డిస్కషన్స్ అడ్వాన్స్ లెవెల్ కు చేరాయని టాక్

అయితే ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి మరో రెండేళ్లు పట్టొచ్చని చెబుతున్నారు.

ప్రస్తుతం KGFChapter2 పూర్తిచేసే పనిలో ఉన్నాడు ప్రశాంత్ నీల్. ఆ తర్వాత ఎన్టీఆర్ తో మరో సినిమా కంప్లీట్ చేయాలి. ఈ గ్యాప్ లో ప్రభాస్ కూడా RadheShyam ప్రాజెక్టు పూర్తిచేసి, నాగ్ అశ్విన్ సినిమాను స్టార్ట్ చేశారు.

ఈ కమిట్ మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాత కేజీఎఫ్-బాహుబలి కాంబినేషన్ కలుస్తుందన్నమాట.