ప్రభాస్ సుజీత్ సినిమా టీజర్ రెడీ

Wednesday,April 19,2017 - 03:36 by Z_CLU

ఇంతకుముందే అనౌన్స్ చేసినట్టు ప్రభాస్-సుజీత్ సినిమా టీజర్ బాహుబలి 2 సినిమాతో పాటు రిలీజ్ కి రెడీ అయిపోయింది. అయితే టీజర్ కన్నా ముందు ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ లోగోని ఏప్రిల్ 23 న, అంటే ఈ ఆదివాారమే  రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్.

150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమా టీజర్ ను నాలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. టీజర్ లో  విజువల్స్ తక్కువ, గ్రాఫిక్ వర్క్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సినిమాకు సాహో అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ టైటిల్ పైనే ఫస్ట్ లుక్ లాంచ్ అవుతుంది.  

ఇక టీజర్ ను ఏప్రిల్ 28 నుంచి బాహుబలి-2 సినిమాతో పాటు ప్రసారం చేయబోతున్నారు. బాహుబలి-2 ఇంటర్వెల్ టైమ్ లో సాహో టీజర్ ప్రసారం అవుతుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రానున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.