ప్రభాస్ ను ఇంకా వదలడం లేదు...

Tuesday,January 03,2017 - 10:56 by Z_CLU

బాహుబలి పార్ట్-2 లోగో లాంచ్ ఈవెంట్ ను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ది-కంక్లూజన్ కు సంబంధించి చాలా డీటెయిల్స్ అప్పుడే తెలిశాయి. అదే టైమ్ లో ప్రభాస్ పెళ్లి, కెరీర్ గురించి కూడా రాజమౌళి మాట్లాడాడు. డిసెంబర్ మూడోవారానికి ప్రభాస్ ను వదిలేస్తానని, ఆ టైమ్ కు బాహుబలి పార్ట్-2 షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని ప్రకటించాడు. కట్ చేస్తే… జనవరిలోకి ఎంటరయ్యాం. కానీ ప్రభాస్ మాత్రం ఇంకా బాహుబలి ప్రాజెక్టుపైనే వర్క్ చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే, బాహుబలి-2 షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. గుమ్మడికాయ కొట్టడానికి మరో వారం, పది రోజులు పట్టేట్టుంది.

baahubali-the-conclusion-bahubali-2-3

రాజమౌళి ప్లానింగ్ ఎప్పుడూ పక్కాగా ఉంటుంది. రిలీజ్ డేట్, ప్రమోషన్, షూటింగ్ విషయాల్లో పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో ఉంటాడు జక్కన్న. బాహుబలి-1 విషయంలో అదే జరిగింది. కానీ బాహుబలి-2 కు మాత్రం కాస్త ఆలస్యమైంది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యమైంది. అయితే రిలీజ్ డేట్ మాత్రం మారదని, ఏప్రిల్ 28కి బాహుబలి-2 థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ ప్రకటించారు.

bahubali5

మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ మరో సినిమా స్టార్ట్ చేసే చూడాలని తహతహలాడుతున్నారు. సుజీత్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు ప్రభాస్ కూడా ప్రకటించాడు. కానీ బాహుబలి-2 ఇంకా కంప్లీట్ కాకపోవడంతో, ఆ ఎఫెక్ట్ నెక్ట్స్ మూవీపై పడింది. ఏదేమైనా సంక్రాంతి నాటికి బాహుబలి-2 సినిమా కంప్లీట్ అయిపోతుందని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత తన కొత్త సినిమాను అఫీషియల్ గా ప్రకటిస్తాడు ప్రభాస్.