Prabhas Project K - మరో సినిమా స్టార్ట్ చేసిన రెబల్ స్టార్

Saturday,December 11,2021 - 08:39 by Z_CLU

Prabhas Starts Shooting of Nag Ashwin’s Project K

ఒక సినిమా పూర్తయిన వెంటనే ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా మరో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు ప్రభాస్. రీసెంట్ గా ఆదిపురుష్ (Adipurush) షూటింగ్ కంప్లీట్ చేసిన రెబల్ స్టార్, ఈరోజు మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. అదే ప్రాజెక్ట్-K (Projeck K). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సెట్స్ లో ఇవాళ్టి నుంచి జాయిన్ అయ్యాడు ప్రభాస్.

ఈ మూవీ కోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ వేశారు. ఆ సెట్ చూడ్డానికి చాలా కొత్తగా ఉంది. అందులోనే హీరోయిన్ దీపిక పదుకోన్ పై రీసెంట్ గా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఇప్పుడిదే షెడ్యూల్ లో ప్రభాస్ కూడా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం దీపిక-ప్రభాస్ (Deepika Padukone Prabhas) పై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

సైన్-ఫిక్షన్ కాన్సెప్ట్ తో వస్తోంది ప్రాజెక్ట్-K. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై పాన్-వరల్డ్ సినిమాగా, భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాకు దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. టెక్నాలజీ అందుబాటులో లేని టైమ్ లోనే ఎన్నో సినీ ప్రయోగాలు చేసిన సింగీతం సేవల్ని ప్రాజెక్ట్-K కోసం వాడుకుంటున్నారు మేకర్స్.

ఈ సినిమా షూటింగ్ చాన్నాళ్ల కిందటే మొదలైంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ పై ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేశారు. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ ఇచ్చి, తాజాగా దీపికతో సెకెండ్ షెడ్యూల్ మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రభాస్ రాకతో ఈ మూవీ షూటింగ్ ఊపందుకుంది. ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్-K సినిమాల్ని సైమల్టేనియస్ గా చేస్తున్నాడు ప్రభాస్. సలార్ పూర్తయిన వెంటనే సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ (Spirit) సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడు. ఇలా పెళ్లికి దూరంగా, సినిమాలే లోకంగా బతికేస్తున్నాడు రెబల్ స్టార్.