ఎట్టకేలకు బయటకొచ్చిన ప్రభాస్

Thursday,August 06,2020 - 05:28 by Z_CLU

దాదాపు 5 నెలల తర్వాత హీరో ప్రభాస్ బయటకొచ్చాడు. ఈరోజు హైదరాబాద్ లోని ఆర్టీఏ ఆఫీస్ లో ముఖానికి మాస్క్ పెట్టుకొని కనిపించాడు ఈ యంగ్ రెబల్ స్టార్. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యూవల్ చేయించుకునేందుకు, ఈ కరోనా టైమ్ లో ఇలా తొలిసారి బయటకొచ్చాడు ప్రభాస్. దీనికంటే ముందు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటుతూ కనిపించాడు. ఈ రెండు సందర్భాలు మినహా ఈ హీరో ఇంకెక్కడా కనిపించలేదు.

ప్రస్తుతం రాధేశ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమాను సెప్టెంబర్ ఆఖరి వారం లేదా అక్టోబర్ లో సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు.

ఈ మూవీ కోసం అవసరమైతే మరోసారి యూరోప్ వెళ్లాలని యూనిట్ అనుకుంటోంది. అదే కనుక జరిగితే లాక్ డౌన్ తర్వాత ఫారిన్ షెడ్యూల్ పెట్టుకున్న మొట్టమొదటి సినిమా ఇదే అవుతుంది.