గ్రాండ్ గా 'సలార్' లాంఛ్

Friday,January 15,2021 - 04:01 by Z_CLU

ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా సలార్ (Salaar). ఈ రోజు ఈ సినిమా లాంఛింగ్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. కేజీఎఫ్ హీరో యష్, ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. దర్శకుడు రాజమౌళి వస్తాడని ముందే ప్రకటించినప్పటికీ, జక్కన్న హాజరుకాలేదు.

ఓపెనింగ్ లో ప్రభాస్-యష్ హైలెట్ గా నిలిచారు. ప్రాజెక్టు లాంఛింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా #SalaarSagaBegins అనే హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ ఎప్పట్లానే సింపుల్ గా కనిపించి ఎట్రాక్ట్ చేశాడు.

ప్రస్తుతానికి ప్రాజెక్టుకు సంబంధించి డీటెయిల్స్ వెల్లడించలేదు. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకునే ప్లాన్ లో ఉన్నారు. అలాగే విలన్ గా బాలీవుడ్ నుంచి జాన్ అబ్రహాంను తీసుకునే ప్లాన్ లో ఉన్నారు.

Prabhas salaar movie launch 3 Prabhas salaar movie launch 3 Prabhas salaar movie launch 3