Prabhas Salaar - రీమేక్ కాదంట

Wednesday,January 20,2021 - 12:23 by Z_CLU

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటింగ్ సినిమాగా తెరకెక్కుతున్న ‘SALAAR’ ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ కాంబో సినిమా ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ సినిమా కన్నడలో ప్రశాంత్ తీసిన ‘ఉగ్రమ్’ కి రీమేక్ అనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ‘సలార్’ ఏ సినిమాకు రీమేక్ కాదట. ప్రభాస్ కోసం ప్రశాంత్ నీల్ మంచి ఎలివేషన్స్ తో ఒక కొత్త కథ రెడీ చేసుకొని గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట.

ఇందులో కొత్త నటీనటులకు కూడా అవకాశం ఇవ్వనున్నాడు ప్రశాంత్. ఇప్పటికే ఆడిషన్స్ ద్వారా కొంతమందిని సెలెక్ట్ చేసి ఫైనల్ చేసారు. ముందుగా హైదరాబాద్ లో మొదటి షెడ్యుల్ ని భారీ గా ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ అండ్ టీం.

KGF తో యష్ ను పాన్ ఇండియా స్టార్ గా తీర్చిదిద్దిన ప్రశాంత్ బాహుబలి ప్రాంచైజీ తో ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు అందుకున్న ప్రభాస్ ను ఎలా ప్రెజెంట్ చేస్తాడా ? అటు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. మరి ఈ కాంబో ‘సలార్’ తో ఎంతటి సంచలన విజయం సాధిస్తుందో వేచి చూడాలి.