Prabhas Saaho - బ్యాడ్ బాయ్ వస్తున్నాడు

Wednesday,October 14,2020 - 06:28 by Z_CLU

టాలీవుడ్ లో ఎన్నో యాక్షన్ మూవీస్ ఉన్నాయి. దాదాపు ప్రతి హీరో ఎకౌంట్ లో యాక్షన్ జానర్ ఉంది. మరి ఆల్ టైమ్ బెస్ట్ యాక్షన్ మూవీస్ లిస్ట్ తీస్తే..? ఆ లిస్ట్ లో ఏ సినిమాలుంటాయో చెప్పలేం కానీ, Prabhas Saaho మాత్రం కచ్చితంగా ఉంటుంది.

హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమా జీ తెలుగు ఛానెల్ లో టెలికాస్ట్ కానుంది. 18వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కాబోతోంది సాహో.

ప్రభాస్ ను అప్పటివరకు ఎవ్వరూ చూడని హై-ఎండ్ యాక్షన్ హీరోగా ప్రజెంట్ చేసింది సాహో సినిమా. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేశారు.

దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా వచ్చిన సాహోలో.. Prabhas-ShraddhaKapoor పెయిర్ సూపర్ హిట్టయింది. ఇక జాక్వెలిన్ ఐటెంసాంగ్ అయితే కేక.

సుజీత్ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో ఇలా ఎన్నో ఎట్రాక్షన్స్ ఉన్నాయి. సో.. ఈ ఆదివారం జీ తెలుగు, జీ తెలుగు HD ఛానెల్స్ లో SAAHO మేనియాను మరోసారి ఎంజాయ్ చేయండి.