ఆస్ట్రియాలో ప్రభాస్ ‘సాహో’...

Friday,June 21,2019 - 02:24 by Z_CLU

ప్రస్తుతం ఆస్ట్రియాలో ఉంది ప్రభాస్ ‘సాహో’ టీమ్. రీసెంట్ గా ఓ సాంగ్ ని తెరకెక్కించిన మేకర్స్ సక్సెస్ ఫుల్ గా ప్యాకప్ చెప్పేశారు. ఈ సందర్భంగా పోస్ట్ ప్యాకప్ సందడి చేసిన ‘సాహో’ టీమ్, సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేశారు. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి.

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాకి సంబంధించిన షూటింగ్ ని వీలైనంత త్వరలో కంప్లీట్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న మేకర్స్, మరో వైపు ఫుల్ స్వింగ్ లో పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ కూడా నడిపిస్తున్నారు. రీసెంట్ గా  భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య టీజర్ ని రిలీజ్ చేసి, సినిమా స్టాండర్డ్స్ ని పెంచిన ‘సాహో’ టీమ్, త్వరలో సినిమాకి సంబంధించి ప్రమోషన్ ప్రాసెస్ ని కూడా బిగిన్ చేయనున్నారు.

సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది సాహో. UV క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగష్టు 15 న వరల్డ్ వైడ్ గా రిలీజవుతుంది. శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్.