ఈరోజు నుంచి ప్రభాస్ ఇంట్రడక్షన్

Monday,March 25,2019 - 11:45 by Z_CLU

సాహో సినిమాకు సంబంధించి మరో కీలకమైన షెడ్యూల్ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి రామోజీ ఫిలింసిటీలో ఈ షూటింగ్ స్టార్ట్ అయింది. వారం రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో ప్రభాస్ పై హీరో ఇంట్రడక్షన్ సన్నివేశాలు తీయబోతున్నారు. కేవలం హీరో ఇంట్రడక్షన్ కోసమే ఈ వారం రోజుల షెడ్యూల్ కేటాయించారు.

దీని కోసం రామోజీ ఫిలింసిటీలో భారీ బిల్డింగ్ సెట్ తో పాటు మరో 2 భవనాల సెట్స్ వేశారు. ఇక్కడే ప్రభాస్ ఇంట్రో ప్లాన్ చేశారు. సినిమా కోసం ఇప్పటికే పిక్చరైజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఈ ఇంట్రో ఎపిసోడ్ కూడా హైలెట్ గా నిలుస్తుందని చెబుతోంది యూనిట్.

ఓవైపు సాహోను పూర్తిచేస్తూనే మరోవైపు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ప్రభాస్. దీనికి సంబంధించి అన్నపూర్ణ స్టుడియోస్ లో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. సాహో సినిమా ఆగస్ట్ 15న థియేటర్లలోకి రాబోతోంది. అటు రాధాకృష్ణ కుమార్ సినిమాకు జాన్ అనే టైటిల్ అనుకుంటున్నారు.