బాలీవుడ్ లో బలపడుతున్న ‘సాహో’ మానియా

Saturday,July 06,2019 - 12:06 by Z_CLU

బాహుబలి ప్రభాస్ ని బాలీవుడ్ లో కూడా సక్సెస్ ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేసింది. అందులో అనుమానం లేదు. ప్రభాస్ అంటే ఇప్పుడు బాలీవుడ్ లో ప్రతి గల్లీకి పరిచయమే. అంత మాత్రాన బాలీవుడ్ సూపర్ స్టార్స్ కి ధీటుగా ప్రభాస్ నిలబడగలుగుతాడా…? సౌత్ లో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు… కానీ బాలీవుడ్ లో ప్రభాస్ రేంజ్ ఏంటనేది ‘సాహో’ నిరూపించనుంది.

టాలీవుడ్ సినిమాలు ఆగష్టు 15 ని మార్క్ చేసి పెట్టుకుని మరీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నాయి. కానీ బాలీవుడ్ లో ఆ పరిస్థితి లేదు… అందునా ఈ తేదీ ‘సాహో’ ముందు పెద్ద చాలెంజ్ నే ఫిక్స్ చేసింది. అదే రోజు అక్షయ్ కుమార్ ‘మిషన్ మంగళ్’ రిలీజవుతుంది.

బాలీవుడ్ ఆడియెన్స్ ‘సాహో’ కి రావాలంటే ‘మిషన్ మంగళ్’ ని పక్కన పెట్టాలి… అది జరిగేనా..? ప్రభాస్ మానియా అక్షయ్ కుమార్ కి ఉన్న క్రేజ్ ముందు నిలబడగలదా…? సమాధానం అయితే చాలా పాజిటివ్ గా ఉంది. నిజం చెప్పాలంటే ‘సాహో’ కి సౌత్ లో ఎంత డిమాండ్ ఉందో… బాలీవుడ్ లో కూడా అంతే ఉంది. 

‘సాహో’ మేకర్స్ చేస్తున్న ప్రతి చిన్న ప్రమోషన్ కి బాలీవుడ్ ఆడియెన్స్ నుండి భారీ స్థాయిలో రెస్పాన్స్ ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే రోజు రోజుకి బాలీవుడ్ లో ‘సాహో’ మానియా మరింత బలపడుతుందనే చెప్పాలి…