ప్రభాస్ సాహో లొకేషన్స్ ఫిక్సయ్యాయి

Friday,May 26,2017 - 05:45 by Z_CLU

ప్రభాస్ బాహుబలి తరవాత తెరకెక్కనున్న ‘సాహో’ గ్రౌండ్ వర్క్ ఫాస్ట్ పేజ్ లో నడుస్తుంది. బాహుబలి 2 రిలీజ్ తో పాటే రిలీజయిన ‘సాహో’ టీజర్ ప్రభాస్ ఫ్యాన్స్ లో సినిమా పట్ల హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేస్తే, ఇప్పుడు సినిమా యూనిట్ ఫ్యాన్స్ లో క్రియేట్ అయిన ఆ ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అయ్యే ప్రాసెస్ లో ఉంది.

సినిమాలో కాస్టింగ్ దగ్గరి నుండి, టెక్నీషియన్స్ వరకు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న సాహో టీమ్, లొకేషన్స్ వేటలో పడింది. జూలై ఫస్ట్ వీక్ లో సినిమాని సెట్స్ పైకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్న సినిమా యూనిట్ కొన్ని కీలక సన్నివేశాల కోసం దుబాయ్, యూరోప్ దేశాలను ఎంచుకుంది.

యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ‘ట్రాన్స్ ఫార్మర్స్’ లాంటి హాలీవుడ్ సినిమాలు ఫైట్స్ కంపోజ్ చేసిన ‘కెన్నీ బేట్స్’ ని ఎంచుకున్న టీమ్, సినిమాలోని ప్రతి ఎలిమెంట్ ని రిచ్ & క్లాస్ గా ప్రెజెంట్ చేసే ఆలోచనలో ఉంది.