హాట్ టాపిక్ గా మారిన సాహో ఫస్ట్ లుక్ పోస్టర్

Wednesday,October 18,2017 - 08:03 by Z_CLU

ప్రభాస్ ‘సాహో’ మూవీ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మరోవైపు అక్టోబర్ 23 న జరగనున్న ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ కి ఆల్ రెడీ ప్రిపరేషన్స్ బిగిన్ చేసేశారు ఫ్యాన్స్. అయితే ఈ సెలబ్రేషన్స్ తో పాటు దీపావళి సందర్భంగా సాహో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ గ్యారంటీ అనే టాపిక్ సోషల్ మీడియాలో ఇంటరెస్టింగ్ డిస్కషన్ పాయింట్ గా మారింది.

ఈ విషయంలో సినిమా యూనిట్ తరఫున ఎటువంటి అఫీషియల్ అప్ డేట్ అయితే లేదు కానీ, కొందరు ఫ్యాన్స్ మాత్రం దీపావళికి ‘సాహో’ నుండి సర్ ప్రైజ్ గ్యారంటీ అని ఎక్స్ పెక్ట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం డార్లింగ్ బర్త్ డే కి మెస్మరైజింగ్ సర్ ప్రైజ్ గ్యారంటీ వెయిట్ చేస్తున్నారు.

సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుండి షూటింగ్ పైనే ఫుల్ గా కాన్సంట్రేట్ చేస్తున్న సినిమా యూనిట్, ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని మైండ్ లో పెట్టుకుని దీపావళికి సర్ ప్రైజెస్ ప్లాన్ చేస్తుందా లేదా..? అనేది ఇంకొన్ని గంటలు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది.