లైన్ క్లియర్ చేసుకున్న ‘సాహో’

Friday,August 23,2019 - 05:10 by Z_CLU

ప్రభాస్ ‘సాహో’ సెన్సార్ క్లియరైంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా U/A సర్టిఫికెట్ పొందింది. ఈ నెల 30 న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న ఈ సినిమాకి సెన్సార్ సభ్యుల నుండి ప్రశంసలు దక్కడం విశేషం.

సెన్సార్ ఫార్మాలిటీస్ తరవాత ‘సాహో’ డ్యూరేషన్ 2 గంటల 51 నిమిషాల 52 సెకన్లు. హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కిన ‘సాహో’ మరో వారం రోజుల్లో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది. ఇప్పటికే సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్న మేకర్స్, ఇండియన్ సినిమా కాన్వాస్ పై మరిన్ని టెక్నికల్ స్టాండర్డ్స్ ని సెట్  చేయబోతున్నారు.

ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ లా కనిపించబోతున్నాడు ప్రభాస్. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కింది సాహో. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించింది. జాక్లిన్ ఫెర్నాండెజ్ సాహో కి మరో గ్లామరస్ ఎట్రాక్షన్స్. UV క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.