ప్రభాస్ సాహో – ఇంకో యాంగిల్ లో...

Wednesday,April 17,2019 - 04:25 by Z_CLU

‘సాహో’ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేవి యాక్షన్ సీక్వెన్సెస్. ఫిల్మ్ మేకర్స్ కూడా ఈ సినిమా గురించి ఎక్కడ డిస్కషన్స్ వచ్చిన ఈ సీక్వెన్సెస్ నే హైలెట్ చేస్తూ వచ్చారు. ఈ సినిమా నుండి రిలీజైన విజువల్స్ లో కూడా యాక్షన్  పైనే మేకర్స్ గురి ఎక్కువగా నిలిచింది. ఫ్యాన్స్ కూడా ‘సాహో’ ని ఆల్మోస్ట్ అదే యాంగిల్ లో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ఈ సినిమా నుండి బయటికి వచ్చిన ఒక స్టిల్ మాత్రం ‘సాహో’ పై ఉన్న అభిప్రాయాన్ని ఒక్కసారిగా మార్చేసింది.

‘సాహో’ ఫిల్మ్ మేకింగ్ ఒకటే కాదు ప్రమోషన్ ప్రాసెస్ కూడా చాలా పకడ్బందీ గా నడుస్తుంది. ‘షేడ్స్ ఆఫ్ సాహో’ అంటూ ఒక్కొక్కటిగా విజువల్స్ ని రిలీజ్ చేస్తూ, ఆడియెన్స్ సినిమా నుండి ఏం ఎక్స్ పెక్ట్ చేయాలో కూడా మేకర్సే క్లారిటీ ఇస్తున్నారు. అయితే ప్రభాస్, శ్రద్ధా కాంబినేషన్ లో ఉన్న ఈ రొమాంటిక్ స్టిల్ మాత్రం, ‘సాహో’ లో జస్ట్ యాక్షన్ ఒక్కటే కాదు, అంతకు మించిన మ్యాజిక్ ఏదో ఉండబోతుందనే వైబ్స్ క్రియేట్ చేస్తుంది.

అప్పుడెప్పుడో 2013 ‘మిర్చి’ లో ఇలా రెగ్యులర్ లుక్ లో కనిపించాడు. ఆ తరవాత ‘బాహుబలి’ లో రాజుల కాలం నాటి లుక్స్ లో కనిపించాడు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఇప్పుడు శ్రద్ధాతో రొమాంటిక్ లుక్స్ లో కనిపించిన ప్రభాస్, ఫ్యాన్స్ లో ఒక్కసారిగా వైబ్స్ క్రియేట్ చేశాడు. ఏది ఏమైనా ఇప్పటి వరకు రిలీజైన విజువల్స్ ‘సాహో’ ని యాక్షన్ యాంగిల్ లో ప్రెజెంట్ చేస్తే ఈ స్టిల్ మాత్రం ‘ సాహో’ లో అదిరిపోయే రొమాంటిక్ యాంగిల్ కూడా ఉండబోతుందనే  క్లారిటీ  ఇస్తుంది.