ప్రభాస్ కొత్త సినిమా ఈ ఏడాది రానట్టే

Sunday,January 19,2020 - 12:04 by Z_CLU

తన సొంత బ్యానర్ పై ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొన్ననే మొదలైంది. ఇకపై ప్రభాస్ తన ఫోకస్ మొత్తం ఈ సినిమాపైనే పెట్టబోతున్నాడు. దీంతో అక్టోబర్-నవంబర్ నాటికి ఈ మూవీ థియేటర్లలోకి వస్తుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ ఈ ఏడాది ప్రభాస్ సినిమా రిలీజ్ అవ్వదని కృష్ణంరాజు క్లారిటీ ఇచ్చారు.

“మా సంస్థ నుంచి ఓ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలుంటాయి. ఇప్పుడు మా నుంచి రాబోతున్న ప్రభాస్‌ కొత్త చిత్రాన్ని ఈ అంచనాలకు తగ్గట్లుగానే రూపొందిస్తున్నాం. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం.. ఇప్పటికే యూరోప్‌లో ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ ప్రారంభమైంది. మరో 3 నెలల పాటు ఇక్కడే చిత్రీకరణ ఉంటుంది. ఏప్రిల్, మే నెలల్లో విదేశాల్లో చిత్రీకరణకు వెళ్తాం. ఈ ఏడాది చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవి నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నాం.”