Radheshyam తమన్ గురించి ప్రభాస్ ఏమన్నాడంటే ?

Monday,March 07,2022 - 06:30 by Z_CLU

Prabhas praises about Thaman’s background score in ‘Radheshyam’

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రూపొందిన ‘రాధే శ్యామ్’ రిలీజ్ కి రెడీ అయింది. మార్చ్ 11న ఐదు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెంచారు మేకర్స్. తాజాగా హైదరాబాద్ లో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమాకు వర్క్ చేసిన టెక్నీషియన్స్ గురించి మాట్లాడుతూ వారికి స్పెషల్ థాంక్స్ చెప్పుకున్నాడు ప్రభాస్.

ముఖ్యంగా తమన్ స్కోర్ గురించి గట్టిగా చెప్పాడు. సినిమాను తమంతా ఒకలా చూస్తే తమన్ ఒకలా చూసి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడని ఖితాబిచ్చాడు. సినిమా చూసి తనే నేపథ్య సంగీతం చేస్తానని చెప్పాడని , తమన్ ప్రాజెక్ట్ లోకి వచ్చాక మేము ఫ్రీ అయ్యామని ఆ భాద్యత చాలా మంచి స్కోర్ ఇచ్చాడని తెలిపాడు ప్రభాస్. అలాగే ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర తన పనితనం చూపించి సినిమాకు బెస్ట్ సెట్స్ వేశారని , ఆయన డిటేలింగ్ చూసి సర్ ప్రయిజ్ అయ్యానని చెప్పాడు. అలాగే జస్టిన్ కంపోజ్ చేసిన సాంగ్స్ లో ‘కడలల్లె’ సాంగ్ తనకి ఎంతో ఇష్టమని తను సినిమాకు ప్రాణం పోశాడని సాఫ్ట్ మ్యూజిక్ తో బెస్ట్ వర్క్ ఇచ్చాడని అన్నాడు ప్రభాస్.

ఇలా టెక్నీషియన్స్ ని రెస్పెక్ట్ చేస్తూ ప్రభాస్ మాట్లాడిన మాటలు ప్రెస్ మీట్ లో హైలైట్ గా నిలిచాయి. ఇక మీకు ఎవరి జాతకం తెల్సుకోవాలని ఉంది ? అనే ప్రశ్న కి  రాధేశ్యామ్ గురించి అంటూ నవ్వుతూ జవాబిచ్చాడు ప్రభాస్.

 

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics