Prabhas - మరో పాన్ ఇండియా మూవీకి రెడీ

Tuesday,December 22,2020 - 12:44 by Z_CLU

బాహుబలి-2 తర్వాత తన ప్రతి సినిమాకు పాన్-ఇండియా అప్పీల్ ఉండేలా కేర్ తీసుకుంటున్నాడు ప్రభాస్ (Prabhas). ప్రస్తుతం ఆయన చేస్తున్న మూవీస్ అన్నీ పాన్-ఇండియన్ సినిమాలే. ఇప్పుడీ హీరో మరో బడా మూవీని ఎనౌన్స్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ కు ఓ సినిమా చేసి పెట్టాలి ప్రభాస్. కానీ సరైన కథ, దర్శకుడు సెట్ అవ్వడం లేదు. మైత్రీ నిర్మాతలు లోకల్ డైరక్టర్స్ ను రిఫర్ చేస్తున్నారట. దీంతో ఎవరైనా బాలీవుడ్ డైరక్టర్ ను చూడమని ప్రభాస్ సూచించాడట.

ప్రస్తుతం ఓ బాలీవుడ్ డైరక్టర్ ను వెదికిపట్టే పనిలో మైత్రీ మూవీ మేకర్స్ బిజీగా ఉన్నారు. డైరక్టర్ తో పాటు కథ కూడా సెట్ అయితే.. త్వరలోనే ప్రభాస్ నుంచి మరో పాన్-ఇండియా మూవీ ఎనౌన్స్ మెంట్ వచ్చేస్తుంది.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రాధేశ్యామ్ (Radheshyam), ఆదిపురుష్ (AdiPurush), సలార్ (Salaar) సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ మూవీ ఉంది. వీటిలో రాధేశ్యామ్ షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. త్వరలోనే సలార్ మొదలవుతుంది.

Also Check – సలార్ కాస్టింగ్ కాల్ పూర్తి