Prabhas Car - ఇది చాలా కాస్ట్ లీ గురూ!

Monday,March 29,2021 - 11:44 by Z_CLU

డబ్బులుంటే ఖరీదైన కారు కొనుక్కోడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు టాలీవుడ్ హీరోలు. ప్రభాస్ కూడా ఇంతే. ఇప్పటికే 3 కాస్ట్ లీ కార్లు వాడుతున్న యంగ్ రెబల్ స్టార్.. ఇప్పుడు వాటి కంటే అత్యంత ఖరీదైన కారును సొంతం చేసుకున్నాడు. అదే లాంబోర్గిని.

Lamborghini Aventador Roadster సెగ్మెంట్ కు చెందిన ఈ కారు చూడ్డానికి ఎంత సెక్సీగా ఉంటుందో.. రేటు కూడా అంతే కాస్ట్ లీ. ట్యాక్సులతో కలుపుకొని దీని రేటు అటు ఇటుగా 6 కోట్ల రూపాయలు.

prabhas car Lamborghini 2

టాలీవుడ్ లోనే కాదు, ఇండియన్ సెలబ్రిటీలు వాడుతున్న కాస్ట్ లీ కార్లలో ప్రభాస్ కారు కూడా ఒకటిగా నిలిచింది. ఆరెంజ్, గోల్డ్ కలర్స్ మిక్స్ తో వచ్చిన ఈ స్పోర్ట్స్ మోడల్ కారును చూసి ప్రభాస్ పొంగిపోయాడు. ఆ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రభాస్ 2 సినిమాలు చేస్తున్నాడు. ఆదిపురుష్, సలార్ సెట్స్ పై ఉన్నాయి. అతడు నటించిన రాధేశ్యామ్ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది.