సాహో ప్రభాస్.. హిందీలో సొంత డబ్బింగ్

Tuesday,May 14,2019 - 03:09 by Z_CLU

తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది సాహో సినిమా. తెలుగు, హిందీలో సినిమాను పిక్చరైజ్ చేస్తున్నారు. మలయాళ, తమిళ భాషల్లోకి డబ్బింగ్ చేస్తారు. ఇందులో భాగంగా ప్రభాస్ హిందీలో డబ్బింగ్ చెబుతాడా లేక వేరే గొంతు వినిపిస్తుందా అనే డౌట్స్ మొన్నటివరకు ఉండేవి. ఇప్పుడా డౌట్స్ కు చెక్ పడింది.

సాహో సినిమా హిందీ వెర్షన్ కు తనే డబ్బింగ్ చెప్పుకుంటానని ప్రకటించాడు ప్రభాస్. బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన యంగ్ రెబల్ స్టార్, సోనీ అనే టీచర్ దగ్గర హిందీ నేర్చుకున్నానని, ప్రస్తుతం తనకు హిందీలో మాట్లాడ్డం వచ్చేసిందని చెబుతున్నాడు.

నిజానికి బాహుబలికే ప్రభాస్ తో హిందీలో డబ్బింగ్ చెప్పించాలని అనుకున్నారు. కానీ అప్పటికి టైమ్ సరిపోలేదు. ఈసారి మాత్రం డబ్బింగ్ విషయంలో ముందు నుంచి ఫుల్ క్లారిటీతో ఉన్నాడు ప్రభాస్. కసితో హిందీ నేర్చుకున్నాడు. డబ్బింగ్ కు రెడీ అయ్యాడు. ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకాబోతోంది సాహో.