స్టార్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ?

Sunday,November 05,2017 - 11:50 by Z_CLU

ప్రెజెంట్ ‘సాహో’ సినిమాతో సెట్స్ పై ఉన్న ప్రభాస్.. రాధా కృష్ణతో చేయబోయే సినిమా పనులతో పాటు నెక్స్ట్ చేయబోయే సినిమాపై కూడా ఫోకస్ పెడుతున్నాడట. ప్రెజెంట్ ఈ ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ సినిమాల తర్వాత ప్రభాస్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లో ఒకడైన సుకుమార్ తో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడనే వార్త చక్కర్లు కొడుతుంది.

ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా 1985 నాటి కథతో ‘రంగస్థలం’ సినిమా చేస్తున్న క్రియేటీవ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇటీవలే ప్రభాస్ కి ఓ ఫామిలీ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ వినిపించాడని, ఈ స్క్రిప్ట్ ప్రభాస్ కి బాగా నచ్చడంతో నెక్స్ట్ సుకుమార్ తోనే సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందనే ఎగ్జైట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నారు యంగ్ రెబెల్ స్టార్ ఫాన్స్.