ప్రభాస్ కోసం రెండు బ్యానర్లు

Wednesday,January 02,2019 - 01:07 by Z_CLU

ప్రెజెంట్ రెండు సినిమాలతో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ ఏడాది ఆగస్ట్ లో ‘సాహో’ సినిమాతో థియేటర్స్ లోకి రానున్న ప్రభాస్ వచ్చే ఏడాది సంక్రాంతి కి ‘జాన్(వర్కింగ్ టైటిల్)’  సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ తో బిజీ బిజీ గా గడిపేస్తున్న ప్రభాస్ మరో సినిమాను కూడా ఫైనల్ చేసుకుంటున్నాడు.

‘KGF’ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్.. ఈ కాంబో సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను యూ.వి. క్రియేషన్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్  కంబైన్ గా నిర్మించే ఛాన్స్ ఉందని సమాచారం. బాహుబలి తర్వాత ప్రభాస్ తో ఓ సినిమా చేయాలని చూస్తున్న దిల్ రాజు.. వంశీ , ప్రమోద్ లతో కలిసి ఈ ప్రాజెక్ట్ ను సెట్ చేసే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. అన్ని సెట్ అయితే త్వరలోనే ఈ సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుంది.