వచ్చే నెలలోనే ప్రభాస్ కొత్త సినిమా

Thursday,July 19,2018 - 02:22 by Z_CLU

ప్రభాస్ కొత్త సినిమాకి ముహూర్తం ఫిక్సయింది. ఓ వైపు ప్రభాస్  ‘సాహో’ సినిమాతో బిజీగా ఉంటే, మరోవైపు రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ప్రభాస్ కొత్త సినిమా ప్రిపరేషన్స్ స్పీడందుకుంటున్నాయి . ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేసిన ఫిల్మ్ మేకర్స్ ఆగష్టు 4 న ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయనున్నట్టు తెలుస్తుంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘సాహో’ సినిమా షూటింగ్ ఇంకా ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందో కన్ఫర్మేషన్ లేదు కానీ, ఆ సినిమాకి ప్యాకప్ చెప్పీ చెప్పగానే ప్రభాస్ ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేలా షెడ్యూల్స్ డిజైన్ చేసుకుంది రాధాకృష్ణ టీమ్.

ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కథనందించిన ఈ సినిమాని కృష్ణంరాజు , UV క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమా లాంచ్ ఈవెంట్ లో సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు రివీల్ అయ్యే అవకాశాలున్నాయి.