సోషల్ మీడియాలో ప్రభాస్ కొత్త స్టిల్

Tuesday,October 17,2017 - 01:31 by Z_CLU

సోషల్ మీడియాలో అప్పుడే రెబల్ స్టార్ ప్రభాస్ మానియా బిగిన్ అయిపోయింది. అక్టోబర్ 13 న ప్రభాస్ బర్త్ డే సెలెబ్రేషన్స్ దగ్గర పడుతుండటంతో, ప్రభాస్ ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో హంగామా బిగిన్ చేసేశారు. ఈ సందర్భంగా రిలీజైన ప్రభాస్ కొత్త స్టిల్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ప్రస్తుతం సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘సాహో’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్, సరికొత్త లుక్ లో ఎట్రాక్ట్ చేస్తున్నాడు. అల్టిమేట్ యాక్షన్ అడ్వెంచరస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన  శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి  రెడీ అవుతున్నాడు.