గ్రాండ్ గా లాంచ్ అయిన ప్రభాస్ కొత్త సినిమా

Thursday,September 06,2018 - 06:40 by Z_CLU

ప్రభాస్ కొత్త సినిమా లాంచ్ అయింది. ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేసిన ఫిల్మ్ మేకర్స్ ఈ రోజు కృష్ణంరాజు గారి ఆఫీస్ లో ఈ సినిమా అఫీషియల్ గా లాంచ్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ సోషల్ మీడియాలో షేర్ కూడా చేశాడు. న్యూ ఏజ్ లవ్ & యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి రానుంది.

మ్యాగ్జిమం షూటింగ్ యూరోప్ లో జరుపుకోనున్న ఫిల్మ్ మేకర్స్, ఆల్మోస్ట్ లొకేషన్స్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. గ్రాండియర్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి అమిత్ త్రివేది మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు. మనోజ్ పరమహంస ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్.

ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా, గోపీకృష్ణా మూవీస్, UV క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. ఈ సినిమాకి రాధా కృష్ణ డైరెక్టర్.