మళ్లీ ట్రాక్ పైకి ప్రభాస్ కొత్త సినిమా

Tuesday,October 22,2019 - 05:52 by Z_CLU

సాహో సినిమా ప్రమోషన్ వల్ల రాధాకృష్ణ కుమార్ డైరక్షన్ లో చేస్తున్న జాన్ (వర్కింగ్ టైటిల్) మూవీని కొన్నాళ్లు పక్కనపెట్టాడు ప్రభాస్. ఆ తర్వాత కొన్నాళ్లు షూటింగ్స్ కు గ్యాప్ ఇచ్చాడు. అలా లేట్ అవుతూ వస్తున్న ఈ సినిమాను తిరిగి సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ప్రభాస్. హైదరాబాద్ లో జాన్ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ ఉంటుంది.

జాన్ మూవీ కోసం హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. దీనికోసం ఓ భారీ ఇంటి సెట్ ను నిర్మిస్తున్నారు. ఈ సెట్లో ప్రభాస్ తో పాటు ఇతర నటీనటులతో కొన్ని సీన్స్ తీయబోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ లండన్ లో ఉన్నాడు. కొన్ని రోజులు అక్కడే ఉంటాడు. అతడు హైదరాబాద్ తిరిగొచ్చిన వెంటనే కొత్త షెడ్యూల్ డేట్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారు.

గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. సాహో టైమ్ లోనే ఈ సినిమాకు సంబంధించి పారిస్ లో ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేశాడు ప్రభాస్.

టెక్నీషియన్స్
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస
మ్యూజిక్ : అమిత్ త్రివేది
ఎడిటర్ :శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్ : రవీందర్
సమర్పణ : గోపికృష్ణా మూవీస్ కృష్ణం రాజు
బ్యానర్, నిర్మాణం : యూవీ క్రియేషన్స్ ప్రమోద్, వంశీ
దర్శకుడు : కే కే రాధాకృష్ణ కుమార్