సాహో సినిమాలో ప్రభాస్ లుక్?

Tuesday,July 18,2017 - 11:46 by Z_CLU

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు చెందిన ఓ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూ లుక్ లో ప్రభాస్ నిజంగా అదిరిపోయాడు. గడ్డం, మీసం, హెయిర్ స్టయిల్ ఇలా అన్నీ మార్చేశాడు. ప్రస్తుతం సౌత్ లో ట్రెండింగ్ అవుతున్న ఫొటో ఇదే

కాకపోతే ప్రభాస్ అప్ కమింగ్ మూవీ సాహోలో ఇదే గెటప్ ను కొనసాగిస్తారా.. లేక సెట్స్ పైకి వచ్చేసరికి మరో మేకోవర్ ట్రై చేస్తారా అనేది అందర్లో ఉన్న డౌట్. తాజా సమాచారం ప్రకారం, సాహో సినిమా కోసం ఇదే లుక్ ను కంటిన్యూ చేసే అవకాశాలున్నాయట.

వచ్చే నెల నుంచి సాహో సినిమా సెట్స్ పైకి రానుంది. మొదటి షెడ్యూల్ ను రామోజీ ఫిలింసిటీలో నిర్వహించి, తర్వాత మరో భారీ షెడ్యూల్ ను దుబాయ్ లో ప్లాన్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుజీత్ దర్శకుడు. హీరోయిన్ ను ఇంకా ఫైనలైజ్ చేయలేదు.