ఆ ప్రచారం ఉత్తిదే...

Tuesday,October 04,2016 - 05:30 by Z_CLU

ఓ హిట్ సినిమాలో కమెడియన్ బ్రహ్మానందం రకరకాల పనులు చేస్తుంటాడు. శృతిహాసన్ తో కలిసి బ్రహ్మి చేయని హంగామా లేదు. ఇదేంటని అడిగితే క్రేజీగా ఉంటుందని అంటుంటాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా అలాంటిదే ఓ క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతోంది. సూర్య సీక్వెల్ వెంచర్ సింగం-3లో అతడితో పాటు… మన బాహుబలి ప్రభాస్ కూడా నటిస్తున్నాడనేది ఆ సెన్సేషనల్ రూమర్. అయితే అదంతా క్రేజీ కోసం ఎవరో సృష్టించారని తాజాగా తెలిసింది.

suriya-and-prabhas

       సింగం-3లో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ కోసం ప్రభాస్ తో సూర్య చర్చలు జరిపాడని వార్తలొచ్చాయి. ఆ క్యారెక్టర్ చేసేందుకు ప్రభాస్ కూడా ఇంట్రెస్ట్ చూపించినట్టు మరికొందరు రాసుకొచ్చారు. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సింగం-3 యూనిట్ క్లారిటీ ఇచ్చింది. డిసెంబర్ లో విడుదలకానున్న ఈ సీక్వెల్ లో కేవలం సూర్య మాత్రమే కనిపిస్తాడని చెప్పారు. ఈ క్లారిటీతో ఇన్నాళ్లూ రౌండ్స్ కొట్టిన పుకార్లు ఆగిపోయాయి.