హాట్ టాపిక్ : ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ కాన్సెప్ట్ ఇదే!

Thursday,February 27,2020 - 03:45 by Z_CLU

మహానటి లాంటి బయోపిక్ తీశాడు. అంతకుముందు ఎవడే సుబ్రమణ్యం లాంటి ఫిలాసఫికల్ మూవీ చేశాడు. దీంతో దర్శకుడు నాగ్ అశ్విన్ తన నెక్ట్స్ సినిమాకు ఎలాంటి స్టోరీలైన్ పిక్ చేసుకున్నాడనేది అంతుచిక్కని విధంగా తయారైంది. మరీ ముఖ్యంగా ప్రభాస్ తో సినిమా కావడం, అశ్విన్ చెప్పిన కథకు యంగ్ రెబల్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమా స్టోరీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఓ సైన్స్ ఫిక్షన్ కథతో రాబోతున్నారు ప్రభాస్-నాగ్ అశ్విన్. వైజయంతీ మూవీస్ బ్యానర్ పైన్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా రాబోతోంది. ఇది జస్ట్ పాన్-ఇండియా కాదు, పాన్-వరల్డ్ సినిమా అంటూ నాగ్ అశ్విన్ ప్రకటించాడంటేనే సినిమా స్టోరీలైన్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ప్రభాస్ ఈ స్టోరీ యాక్సెప్ట్ చేయడానికి ఇక్కడ మరో రీజన్ కూడా ఉంది. ఇలాంటి కథలకు రీజనల్ బారియర్స్ ఉండవు. హిందీ, తెలుగు, తమిళ్ అనే భాషా భేధాలుండవు. కాబట్టి తన ఇమేజ్, మార్కెట్ కు ఈ కథ సరిగ్గా సూట్ అవుతుందని ప్రభాస్ భావించాడు.

ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ మెంట్ కే పరిమితం చేశారు. ఇంకా చాలా టైమ్ ఉంది కాబట్టి.. కంప్లీట్ గా ప్రీ-ప్రొడక్షన్ పూర్తిచేసిన తర్వాత సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటపెడతారు. అన్నట్టు తన సినిమాలకు సంబంధించి కథను దాచిపెట్టడానికి నాగ్ అశ్విన్ పెద్దగా ఇష్టపడడు. కాబట్టి జానర్, స్టోరీలైన్ ఏంటనేది ముందే చెప్పే అవకాశాలున్నాయి.