Prabhas Movies - లైనప్ అదిరింది

Monday,October 11,2021 - 01:29 by Z_CLU

Prabhas Movies – Interesting Line Up

‘బాహుబలి’ ఫ్రాంచైజీ కోసం ఐదేళ్ళు కేటాయించిన ప్రభాస్ ఇప్పుడు ఆ సమయంలో ఐదారు సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు. అవును ప్రస్తుతం ప్రభాస్ లైనప్ చూస్తే ఐదేళ్ళు బిజీ అయ్యేట్టు కనబడుతున్నాడు. ప్రభాస్ ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్ పై పెట్టేసి ఫుల్ బిజీ గా ఉన్నాడు. #Salaar #Adipursuh #ProjectK మూడు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఒక సినిమా షెడ్యుల్ గ్యాప్ లో మరో సినిమా షూట్ లో పాల్గొంటూ చకచకా దూసుకెళ్తున్నాడు ప్రభాస్.

ఇక తాజాగా ప్రభాస్ తన ల్యాండ్ మార్క్ సినిమా #Prabhas25 ని కూడా ఎనౌన్స్ చేశాడు. ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేయబోతున్నాడు. అయిది మధ్యలో ప్రభాస్ మరో సినిమా చేయాల్సి ఉంది. అవును #Prabhas24 గురించి చెప్పకుండానే డైరెక్ట్ గా తన 25వ సినిమా ఫిక్స్ చేసుకొని ప్రకటన ఇచ్చేశాడు. దీంతో #Prabhas24 సినిమాపై వివిధ ప్రచారాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ తో ప్రభాస్ ఆ సినిమా చేస్తాడని అంటున్నారు. మరో వైపు దిల్ రాజు బేనర్ లో ప్రభాస్ కమిట్ అయిన సినిమా తన 24వ సినిమాగా రానుందనే టాక్ కూడా వినిపిస్తుంది.

prabhas sandeep vanga spirit

అలాగే బాహుబలి తర్వాత మైత్రి మూవీ మేకర్స్ నుండి కూడా అడ్వాన్స్ అందుకున్నాడు. అది #Prabhas26 గా రానుందని తెలుస్తుంది. దిల్ రాజు బేనర్ సినిమాకు అలాగే మైత్రి బేనర్ సినిమాకు ఇంకా దర్శకుడు ఫిక్స్ అవ్వలేదు. ప్రభాస్ కోసం కథలు రెడీ చేసే పనిలో ఈ నిర్మాతలు బిజీగా ఉన్నారు. దిల్ రాజు ఇప్పటికే ఓ ఇద్దరు ముగ్గురు దర్శకులను సంప్రదిస్తూ కథలు సిద్దం చేసుకుంటున్నారు. ఇక మైత్రి నిర్మాతలు కూడా అదే పనిలో ఉన్నారు. ఒక్కో సినిమాకు ఏడాది పైనే పట్టొచ్చు. ఎంత లేదన్నా ప్రభాస్ ఇలా వరుస సినిమాలతో ఐదేళ్ళు బిజీ అవ్వడం ఖాయం అనిపిస్తుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics