బాలీవుడ్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా

Saturday,July 04,2020 - 01:44 by Z_CLU

ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్ లో తన 20వ సినిమా చేస్తున్న ప్రభాస్ నెక్స్ట్ నాగ్ అశ్విన్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.  ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ అయిన వెంటనే మరో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నాడట ప్రభాస్. అవును.. నాగ్ అశ్విన్ సినిమా తర్వాత ఓ బాలీవుడ్ డైరెక్టర్ తో రెబల్ స్టార్ సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమా ఓ బడా నిర్మాణ సంస్థలో తెరకెక్కనుందని.. ఆల్రెడీ ప్రభాస్ కి ఆ సంస్థ ద్వారా భారీ అడ్వాన్స్ కూడా అందిందని టాక్. మరి ప్రభాస్ ను డైరెక్ట్ చేసే ఆ బాలీవుడ్ డైరెక్టర్ ఎవరు..? ఈ సినిమాను నిర్మించే సంస్థ వివరాలు తెలియాల్సి ఉంది.

వరుసగా పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్న ప్రభాస్ వీటితో ఎలాంటి విజయాలు అందుకుంటాడో వేచి చూడాలి. అన్నట్టు దిల్ రాజు బ్యానర్ లో కూడా ఈ హీరో ఓ సినిమా చేయాలి. అదెప్పుడు తెరపైకొస్తుందో చూడాలి.