అమెరికాకు వెళ్ళబోతున్న ప్రభాస్

Tuesday,May 02,2017 - 03:09 by Z_CLU

బాహుబలి 2 బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ బ్రేకులు చేసే పనిలో ఉంది. ఐదేళ్ళు జస్ట్ బాహుబలి కోసమే డెడికేట్ చేసిన ప్రభాస్ ‘సాహో’ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. 150 కోట్ల బడ్జెట్ తో సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.

సాహో సినిమా సెట్స్ పైకి వచ్చే ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ కాలేదు కానీ ఈ లోపు అమెరికా ట్రిప్ ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్. ఇన్నాళ్ళు బాహుబలి రెగ్యులర్ షెడ్యూల్స్ తో బిజీ బిజీగా గడిపిన ప్రభాస్ కొన్నాళ్ళు రిలాక్స్ అవ్వడంతో పాటు, తన నెక్స్ట్ వెంచర్ సాహో సినిమా మేకోవర్ కూడా అక్కడే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

సుజిత్ సినిమాలో తెరకెక్కనున్న ‘సాహో’ సినిమా టీజర్ ఇప్పటికే క్యూరాసిటీ జెనెరేట్ చేయడంలో సక్సెస్ అయింది. 2018 రిలీజ్ కి టార్గెట్ చేసిన సినిమా యూనిట్, తక్కిన స్టార్ కాస్ట్ ని డిసైడ్ ప్రాసెస్ లో ఉంది.