#RadheShyam - ప్రభాస్ స్టైలిష్ లుక్

Wednesday,October 21,2020 - 01:37 by Z_CLU

‘Radheshyam’ నుండి Prabhas స్టైలిష్ లుక్ ను విడుదల చేసారు మేకర్స్. ఇప్పటికే ఫస్ట్ లుక్ అందరినీ ఎట్రాక్ట్ చేసి అంచనాలు పెంచగా తాజాగా రిలీజ్ చేసిన ప్రభాస్ సోలో పోస్టర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. సినిమాలో ప్రభాస్ ‘Vikram Aditya’గా కనిపిస్తాడని పోస్టర్ ద్వారా క్లారిటీ ఇస్తూ క్యారెక్టర్ ఎంత స్టయిలిష్ గా ఉంటుందో తెలియజేసారు.

ప్రస్తుతం రాధే శ్యామ్ నుండి రిలీజైన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

Prabhas Look Radhe Shyam movie

GopiKrishna Movies సమర్పణలో UV Creations, T Series నిర్మిస్తున్న ఈ సినిమాకు Radha Krishna దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఇటలీలో సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాకు Justin Prabhakaran మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

Also Read – రాధేశ్యామ్ లో ‘ప్రేరణ’

మరోవైపు సినిమా రిలీజ్ డేట్ ను కూడా మోషన్ పోస్టర్ తో పాటు ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 28న ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అదే తేదీకి గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి-2 రిలీజైంది.