ప్రభాస్ లాంచ్ చేసిన ట్రయిలర్ ఇదే

Tuesday,April 23,2019 - 03:41 by Z_CLU

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకొచ్చాడు. నువ్వు తోపురా సినిమా ట్రయిలర్ ను లాంఛ్ చేశాడు ప్రభాస్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ సుధాకర్ ఇందులో హీరోగా నటించాడు. ట్రయిలర్ చూసిన ప్రభాస్, యూనిట్ ను ప్రత్యేకంగా అభినందించాడు.

యునైటెడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కింది నువ్వు తోపురా సినిమా. దేవుళ్లు సినిమాలో బాలనటిగా మెప్పించిన నిత్యాషెట్టి ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమౌతోంది. ఈ సినిమా కోసం అమెరికాలో 52 రోజుల పాటు షూటింగ్ చేశారు. ఆ ఎపిసోడ్స్ అన్నీ సినిమాకు హైలెట్ అంటోంది యూనిట్.

గీతా ఆర్ట్స్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈనెల 26న ఈ సినిమా వరల్డ్ వైడ్ విడుదలకానుంది. సురేష్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఒకప్పటి హీరోయిన్ నిరోషా ఓ కీలక పాత్రలో కనిపించనుంది