కరణ్ జోహార్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ

Tuesday,April 04,2017 - 01:39 by Z_CLU

ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీకి ఆల్ సెట్ అయిందా..? కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘డ్రైవ్’ సిరీస్ లో ప్రభాస్ ఒక స్పెషల్ రోల్ చేయబోతున్నాడనే టాక్ జస్ట్ బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోను వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తోంది. బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ గా గుర్తింపు పొందిన ప్రభాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎక్స్ క్లూజివ్ గా లాంచ్ అవుతున్నాడనే న్యూస్ ఇప్పుడు సినీ టౌన్ లో హాట్ టాపిక్.

బాహుబలి సినిమాలో ప్రభాస్ కి కో-స్టార్ గా నటించిన రానా ఆల్రెడీ బాలీవుడ్ లో స్పేస్ ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ కూడా ‘జంజీర్’ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ఇక డార్లింగ్ ప్రభాస్ ఎంట్రీ ఒక్కటే బ్యాలన్స్.. ఇప్పుడు చక్కర్లు కొడుతున్న ఈ టాక్ గాని నిజమైతే ఆ లోటు కూడా తీరిపోతుంది.

బాహుబలి సినిమా బాలీవుడ్ లో ఇంతలా రీచ్ అయిందంటే ఆ క్రెడిట్ రో కరణ్ జోహార్ కూ భాగముంది. నార్త్ లో భారీ స్థాయిలో విడుదలవ్వడాానికి కరణ్ జోహారే కాారణం. ఈ దర్శక-నిర్మాత ప్రస్తుతం డ్రైవ్ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. సుషాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం ప్రభాస్ ను అనుకుంటున్నారట. ప్రస్తుతానికి ప్రభాస్ నుండి కానీ కరణ్ జోహార్ నుండి ఈ విషయంపై క్లారిటీ లేదు.