యంగ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' ఇంటర్వ్యూ

Monday,August 26,2019 - 09:23 by Z_CLU

‘బాహుబలి 2’ తర్వాత రెండేళ్ళు ‘సాహో’ కోసం కేటాయించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఎట్టకేలకు ఈ నెల ముప్పైన సాహో అనిపించుకోవడానికి రెడీ అయ్యాడు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు ప్రభాస్. ఆ విశేషాలు డార్లింగ్ మాటల్లోనే…

సుజీత్… నేనే అడిగా

‘రన్ రాజా రన్’ టైం నుండే సుజీత్ తెలుసు. ఆ సినిమా చూసాక నాతో సినిమా చేస్తావా ? అని అడిగాను. కథతో కలుస్తా అన్నాడు. అప్పుడు సుజీత్ కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది. కానీ కథ చెప్తాడనుకోలేదు. ఇక స్టోరీ చెప్పే ముందు ఏదైనా లవ్ స్టోరీతోనో వస్తాడనుకుంటే కానీ స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిలింతో వచ్చాడు. స్క్రీన్ ప్లే , సుజీత్ నెరేట్ చేసిన విధానం బాగా నచ్చి ఒకే చెప్పేసాను.

యాక్షన్ సినిమా చేయలనుకోలేదు

బాహుబలి తర్వాత యాక్షన్ ఫిలిం చేయలనుకోలేదు. ఒక లవ్ స్టోరీతో సినిమా చేయాలనుకున్నాను. కానీ సుజీత్ అనుకోకుండా నాతో సాహో చేయించాడు.

విజువల్ ఇంపాక్ట్ కోసం

బాహుబలి తర్వాత ఆడియన్స్ కి మళ్ళీ ఓ విజువల్ ఇంపాక్ట్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ని స్పెషల్ గా డిజైన్ చేశాం. సాంగ్స్ పిక్చరైజేషన్ లో కూడా జాగ్రత్త తీసుకొని విజువల్ ట్రీట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాం.

యాక్షన్ తో పాటు

సినిమాలో వాయిలెన్స్ ఉంటుంది. హై టెక్నికల్ వాల్యూస్ తో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. కానీ వాటితో పాటు మంచి లవ్ ట్రాక్ అలాగే కామెడీ కూడా ఉంటుంది. అన్నిటికిమించి స్క్రీన్ ప్లే మెస్మరైజ్ చేస్తుంది.

భలే చేసావ్ సుజీత్….

సినిమాలో ఒక కీ సీక్వెన్స్ ఉంటుంది. షూట్ మొదలైన రెండో రోజు షూట్ చేశాం. ఆ సీన్ సినిమాలో చాలా చోట్ల వస్తుంది. క్యారెక్టర్స్ కి చాలా లేయర్స్ ఉంటాయి. అప్పుడే సుజీత్ మీద బాగా నమ్మకం వచ్చింది. ఆ టైంలో భలే చేసావ్ సుజీత్ అనిపించింది. అలా చాలా సందర్భాల్లో సుజీత్ మీద కాన్ఫిడెన్స్ వచ్చింది.

డ్యుయల్ రోల్ కావచ్చు..కాకపోవచ్చు

సినిమాలో నేను డ్యుయల్ రోల్ చేసానా..? లేదా అన్నది చెప్పేయొచ్చు ఏం కాదు. కాని మీకు ఎగ్జైట్ మెంట్ పోతుంది. అందుకే చెప్పట్లేదు. నిజానికి ఆ సస్పెన్స్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశ్యంతోనే ట్రైలర్ అలా కట్ చేశాం.

ఆ టైంలో  నిద్రపట్టలేదు

సినిమాను ముందుగా ఒక వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలనుకున్నాం. కానీ రోజు రోజుకి బడ్జెట్ పెరుగుతూ వెళ్ళింది. బాహుబలి తర్వాత ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ను అందుకోవడానికి తప్పలేదు. నిజానికి ఆడియన్స్ ఎక్కడ డిసప్పాయింట్ అవుతారో అన్న భయంతో బడ్జెట్ పెంచేస్తూ వెళ్ళాం. బడ్జెట్ పెరిగినప్పుడు నిద్ర పట్టలేదు.


‘సాహో’ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్

సినిమాలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కోసం కొందరు హాలీవుడ్ టెక్నిషియన్స్ కూడా పనిచేసారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ , ఎడిటింగ్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి హాలీవుడ్ టీంలు వర్క్ చేసాయి. కొన్ని ఎపిసోడ్స్ కి శ్రీకర్ ప్రసాద్ గారితో మాట్లాడి హాలీవుడ్ ఎడిటర్స్ తో వర్క్ చేయించాం. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్స్ లో మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

బాలీవుడ్లో వాళ్ళు క్లోజ్

బాలీవుడ్ లో కొందరు నాతో క్లోజ్ గా ఉంటారు. రణబీర్ కపూర్ నా ప్రతీ సినిమాకు ఫోన్ చేసి మాట్లాడతాడు. అలాగే అజయ్ దేవగన్ కూడా క్లోజ్ గా ఉంటారు. అమీర్ ఖాన్ గారు మూడు నెలల క్రితం ఫోన్ చేసిన ఓ సినిమా ప్రీమియర్ కి పిలిచారు. బయట ఉన్న డిస్కర్షన్ అక్కడ ఉండదు. నాతో అందరూ బాగా మాట్లాడతారు.

అదో టెన్షన్…ఇదో టెన్షన్

నిజానికి నా మొదటి సినిమా ఈశ్వర్ రిలీజ్ కి ముందు కూడా టెన్షన్ పడ్డాను. అసలు నచ్చుతానా ? లేదా సినిమా చూస్తారా లేదా అని , ఇప్పుడు ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అవుతానా… లేదా అని టెన్షన్ పడుతున్నా. అదో టెన్షన్ ఇదో టెన్షన్. టెన్షన్ మాత్రం కామనే.

కొంచెం లావైపోతారు

పెదనాన్న గారు డిల్లీ గట్టా వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఎవరైనా నా గురించి మాట్లాడిన బాహుబలి గురించి మాట్లాడినా ఆయన పొంగిపోతుంటారు. ఆ క్షణంలో కొంచెం లావైపోతారు(నవ్వుతూ). పెదనాన్న గారు ఇంకా ‘సాహో’ చూడలేదు. టీజర్ ట్రైలర్ ఆయనకీ బాగా నచ్చాయి.

ఆయన యాక్సెప్ట్ చేస్తారనుకోలేదు

‘బిల్లా’ తర్వాత మళ్ళీ పెదనాన్న గారి గోపి కృష్ణ బ్యానర్ లో సినిమా చేస్తున్నా. ఆయనకీ రాధా కృష్ణ చెప్పిన స్టోరీ బాగా నచ్చింది. ప్రెజెంట్ అండ్ పాస్ట్ లవ్ స్టోరీని ఆయన యాక్సెప్ట్ చేయడం జోక్ కాదు. నేను యాక్సెప్ట్ చేస్తారనుకోలేదు.ఇన్పుట్స్ ఏమైనా చెప్తారేమో అనుకున్నాను.


డిఫరెంట్ కంటెంట్ సినిమాలు ఆడుతున్నాయి.

ప్రస్తుతం తెలుగులో కొత్త ఒరవడి మొదలైంది. డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన చిన్న సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి. యాక్టర్స్ లో కూడా చేంజ్ అనేది వస్తుంది. అర్జున్ రెడ్డి తో ప్రూవ్ అయింది. నాని కూడా ‘జెర్సీ’ అనే డిఫరెంట్ కంటెంట్ తో సినిమా చేసాడు. ఈ ఏడాది మన సినిమాలు ఎక్కువ జాతీయ అవార్డులు కూడా గెల్చుకున్నాయి. చాలా హ్యాపీ గా ఉంది.

పోస్ట్ పోన్ చేయలనుకోలేదు

పెళ్లి పోస్ట్ పోన్ చేయలనుకోలేదు. అలా జరిగింది. ప్రెజర్ తీసే వాళ్ళోస్తారా… పెట్టే వాళ్ళోస్థారో తెలియదు కదా(నవ్వుతూ)

కొరటాల శివ గారితో

శివ గారు మిర్చితో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఇద్దరం కలిసి మళ్ళీ కచ్చితంగా సినిమా చేస్తాం. ప్రస్తుతం ఆయనొక పెద్ద సినిమా చేస్తున్నారు. అది పూర్తయ్యాక నేను కూడా ఫ్రీ అయ్యాక కలిసి డిస్కస్ చేస్తాం.

అలాంటిదేం లేదు

కే.జీ.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో నేను సినిమా చేస్తాననే వార్తలో నిజం లేదు. అసలు అలాంటి డిస్కర్షన్స్ ఏం జరగలేదు.