ఫ్రెండ్ కోసం మరోసారి గెస్ట్ అవుతున్న బాహుబలి...

Friday,December 16,2016 - 05:00 by Z_CLU

ఇండస్ట్రీ లో ఒక్కొక్కరిదీ ఒక్కో సెంటిమెంట్ పైకి అలాంటిదేం లేదంటూనే మరో వైపు బ్లైండ్ గా ఆ సెంటిమెంట్ ను ఫాలో అయిపోతారు స్టార్స్. అయితే ఇలాంటి ఓ సెంటిమెంటే హీరో శర్వానంద్ కి కూడా ఉంది. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో ఆ సెంటిమెంట్ తో మరో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

prabhas-sharwanand

ఇంతకీ శర్వా కి సెంటిమెంట్ గా మారిన ఆ హీరో ఎవరో కాదు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. లేటెస్ట్ గా శర్వా హీరోగా నటించిన రెండు సినిమాల ఆడియోలకి గెస్ట్ గా ఎటెండ్ అయి శర్వా కి ఓ సెంటిమెంట్ అయి పోయాడు బాహుబలి. ఇక ఆ సెంటిమెంట్ తోనే ఇప్పుడు మరో సారి ప్రభాస్ ను తన అప్ కమింగ్ మూవీ ‘శతమానం భవతి’ ఆడియో కి ఇన్వైట్ చేయబోతున్నాడట శర్వా. ఇప్పటికే ప్రభాస్ ను ఈ ఫంక్షన్ కి ఇన్వైట్ చేసేసారట యూనిట్.  శర్వ పై ఉన్న అభిమానంతో ఈ ఆడియో కి గెస్ట్ అయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట ప్రభాస్. మరి ఈ సినిమా కూడా సంక్రాంతి బరి లో మరో  హిట్ సాధిస్తే శర్వా కి ప్రభాస్ ఓ గట్టి సెంటిమెంట్ అవ్వడం ఖాయం.