Prabhas ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

Saturday,March 19,2022 - 04:40 by Z_CLU

Prabhas fans are eagerly for Salaar

కొందరు స్టార్ హీరోల నుండి అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు ఫ్యాన్స్. అలా ఊహించి వచ్చిన ఫ్యాన్స్ కి యాక్షన్ ఎపిసోడ్స్ లేకపోతే కష్టంగానే ఉంటుంది. ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా ‘రాధే శ్యామ్’ విషయంలో అదే జరిగింది. పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ నుండి తెలుగు ప్రేక్షకులే కాదు నార్త్ ఆడియన్స్ కూడా భారీ యాక్షన్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. అయితే అలా ఊహించిన అందరినీ రాధే శ్యామ్ కాస్త డిజప్పాయింట్ చేసింది.

ముందు నుండి మేకర్స్ ఈ సినిమాలో యాక్షన్ ఉండదని చెప్పినప్పటికీ ఏదో ఒకచోట ఒక్కటైనా స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్  ఉంటుందనుకున్నారు. అయితే సినిమాలో ఫైట్ కి స్కోప్ ఉన్నప్పటికీ మేకర్స్ అక్కడ యాక్షన్ పెట్టలేదు. పీరియాడిక్ లవ్ స్టోరీగానే ట్రీట్ చేయాలనే ఉద్దేశ్యంతో యాక్షన్ లేకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టకుండా సినిమా ఫినిష్ చేశారు. అయితే ఇప్పుడు ఫైట్స్ లేకుండా ప్రభాస్ సినిమా ఊహించుకోలేని మాస్ ఫ్యాన్స్ ‘సలార్’ కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నారు.

‘KGF’ తో పాన్ ఇండియా లెవెల్ లో యాక్షన్ తో మెప్పించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో తమ ఆకలి తీరుస్తారని భావిస్తున్నారు. నిజానికి ప్రభాస్ -ప్రశాంత్ నీల్ కాంబో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో ప్రభాస్ తో భారీ యాక్షన్ ప్లాన్ చేసుకున్నాడు ప్రశాంత్. అందుకే నార్త్ ఆడియన్స్ కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా ? అని వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనా ‘రాధేశ్యామ్’ నిరాశ పడ్డ ప్రభాస్ ఫ్యాన్స్ ‘సలార్’ తో థియేటర్స్ లో గోల చేస్తూ ఎంజాయ్ చేయడం పక్కా అనిపిస్తుంది.

 

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics