ప్రభాస్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Monday,April 17,2017 - 03:13 by Z_CLU

‘బాహుబలి’ తో అమరేంద్ర బాహుబలి గా ఇంటర్నేషనల్ స్టార్ గా ఇమేజ్ అందుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఏప్రిల్ 28 నుంచి ‘బాహుబలి-2’ తో మళ్ళీ  థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు.. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు ప్రభాస్.. ఆ విశేషాలు ప్రభాస్ మాటల్లోనే…

 

*బాహుబలి నుంచి ఇంకా బయటికి రాలేదు..

నిజానికి బాహుబలి షూటింగ్ అయిపోయినప్పటికీ నేనింకా బాహుబలి సినిమా నుంచి బయటికి రాలేదు. ప్రెజెంట్ ప్రమోషన్ వర్క్ లో ఉన్నాం కాబట్టి ఇంకా బాహుబలి గురించే మాట్లాడుతూ ఏప్రిల్ 28 కోసం ఆడియన్స్ తో పాటు మేము కూడా వెయిట్ చేస్తున్నాం.. ఇప్పుడే బాహుబలి నుంచి బయటికి రాలేను. దానికి ఇంకా టైం ఉంది…

వినాయక్ గారు చెప్పాక షాక్ అయ్యా..

‘బాహుబలి’ రిలీజ్ అయిన మొదటి వారంలోనే వినాయక్ గారు నేను రాజమౌళి గారు కలిశాం. వినాయక్ గారు బాహుబలి చూసి ఇందులో దాదాపు 10 ప్రశ్నలున్నప్పటికీ ఇంత పెద్ద హిట్ అవ్వడం మామూలు విషయం కాదని చెప్పారు. ఆయన చెప్పే వరకూ సినిమాలో అన్ని ప్రశ్నలున్నాయని నాకు కూడా తెలియదు. ఆయన ఆ పది ప్రశ్నల గురించి చెప్తూ ఇంతటి విజయం అందుకోవడం ఈజీ కాదు చాలా గ్రేట్ అని అంటుంటే షాక్ అయ్యా…

 

హీరో కథ కాదు 

నిజానికి బాహుబలి ఒక హీరో కథ కాదు. అందరి క్యారెక్టర్స్ తో కలగలిపిన గొప్ప కథ. శివగామి, కట్టప్ప, మహేంద్ర బాహుబలి, భళ్లాల దేవ, శివుడు, బిజ్జల దేవ, అవంతిక ఇలా అందరి క్యారెక్టర్స్ తో కూడిన కథ. ఇలాంటి కథ మా అందరికి దొరకడం ఆ క్యారెక్టర్స్ మేము చేయడం చాలా హ్యాపీ గా ఒక పెద్ద వరంలా భావిస్తున్నాం ..

 

బాహుబలి కి ముందు  ఆ కథ కూడా చెప్పాడు

రాజమౌళి మన కాంబినేషన్ లో ఒక గొప్ప సినిమా చెయ్యాలి. అంటూ ఒక 5 ,6 కథ వినిపించాడు.. అందులో కృష్ణదేవరాయ కథ కూడా ఉంది.. కానీ అవేవి కుదరలేదు. సరిగ్గా రెబెల్ డబ్బింగ్ జరుగుతున్న టైంలో రాజమౌళి ‘బాహుబలి’ కథ బ్రీఫ్ గా చెప్పాడు. వినగానే బాగా నచ్చి ఎగ్జైట్ అయి చేద్దాం అని అన్నా.. ఇక వెంటనే  స్పీడ్ గా కథ రెడీ చేసేశాడు రాజమౌళి.. సో ఫైనల్ గా బాహుబలి అలా కుదిరింది…

ఆ టెన్షన్ ఉండేది

బాహుబలి షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి రోజుకు అయ్యే ఖర్చు తెలిసి యాక్ట్ చేసే టప్పుడు కాస్త టెన్షన్ గా ఫీలయ్యే వాడిని… ఒక సీన్ జరిగేటప్పుడు  ఎక్కడైనా మిస్ అయితే మళ్ళీ రి టేక్ కి అయ్యే ఖర్చు, టైం దృష్టి లో పెట్టుకొని టెన్షన్ తో కాన్ఫిడెంట్ గా నటించా…

 

అస్సలు ఊహించలేదు

బాహుబలి రిలీజ్ తరువాత కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అనే ప్రశ్న అంత హైలైట్ అవుతుందని గాని సెన్సేషన్ సృష్టిస్తుందని గాని మేమెవ్వరం ఊహించలేదు.. అదో ఇంటర్నేషనల్ ప్రశ్న గా మిగిలిపోయింది.. ఆ ప్రశ్నకి జవాబు తెలుసుకోవడానికి అందరు ఏప్రిల్ 28 కోసం  వెయిట్ చేస్తున్నారు…

 

అవతార్ లా ఉందన్నారు

కరణ్ జోహార్ గారు ఈ సినిమా లో వాటర్ ఫాల్ సీన్ చూసి అవతారాల ఉందన్నారు.. అలాంటి కామెంట్స్ బాహుబలి చాలా అందుకుంది. రాజమౌళి ఓ కల కనడం ఆ కల నిజం చేసి బాహుబలి ఆ రేంజ్ లో నిలబెట్టాడు..

 

దానికి ఓ పది  కారణాలున్నాయి 

నిజానికి కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అనే ప్రశ్న కి ఆన్సర్ చెప్పడం కష్టమే.. దానికి ఓ పది స్విచు వేషన్స్ ఉంటాయి. అవి స్క్రీన్ మీద చూస్తేనే అర్ధం అవుతాయి. సో కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అనేది చెప్పడం కన్నా చూస్తేనే బెటర్..

 

ఆ కొత్తదనమే నచ్చిందేమో

బాహుబలి సినిమా విషయం లో మేం అందరం భయ పడింది.. మూవీ నడుస్తూ నడుస్తూ సడెన్ గా ఫినిష్ అవ్వడం ఆడియన్స్ ను డిస్సపాయింట్ చేస్తుందేమో అని.. కానీ అది అంత క్యూరియాసిటీ నెలకొల్పుతుందని మేం అనుకోలేదు. అలా కథ మధ్యలో సినిమా పూర్తవ్వడం ఇదే మొదటి సారి. ఆ కొత్తదనమే ఆడియన్స్ బాగా నచ్చిందేమో..

 

మైండ్ లో ఆ  ఆలోచనే లేదు

బాహుబలి తర్వాత హాలీవుడ్ లో అఫర్ వచ్చిందని త్వరలోనే సినిమా చేస్తానని వార్తలు విన్నా. ఆవార్తలో నిజం లేదు.. నిజానికి హాలీవుడ్ సినిమా అనేది నా మైండ్ లోనే లేదు. కానీ బాలీవుడ్ లో చేసే అవకాశాలున్నాయి..

 

అది గొప్పగా అనిపించింది

లేటెస్ట్ గా బాహుబలి 2 ప్రమోషన్ కి ముంబై వెళ్ళినప్పుడు అక్కడ మీడియా మేము వెళ్ళగానే నిలబడ్డారు. అది మాకు కొత్తగా అనిపించింది. వాళ్ళు అలా నిలబడం కూడా అదే మొదటి సారట.. అది మా అందరికి గొప్పగా అనిపించింది..

 

నో క్లారిటీ

పెళ్లి గురించి ఇంకా అనుకోలేదు. ప్రస్తుతం ఫాన్స్ కోసం ఏడాది కో రెండు సినిమాలు ప్లాన్ చేసే ఆలోచనలో మాత్రమే ఉన్నా..

 

చాలా ప్లాన్ చేశాం

బాహుబలి తో  నా నెక్స్ట్ సినిమా ప్రమోషన్  గురించి చాలా ప్లాన్ చేశాం. అవి ఏంటి ఏవి వర్కౌట్ అవుతాయనేది మాకే క్లారిటీ లేదు.. దానికి సంబంధించిన విషయాలను త్వరలోనే తెలియజేస్తాం.

 

అది సైమల్టినియస్ గా ప్లాన్ చేస్తున్నాం

రాధా కృష్ణ డైరెక్షన్ లో నటించనున్న సినిమాను సైమల్టినియస్ ప్లాన్ చేస్తున్నాం. ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అనేది ఇంకా అనుకోలేదు…