Salaar - ప్రభాస్ డిఫరెంట్ షేడ్స్

Friday,March 05,2021 - 02:13 by Z_CLU

ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తోంది సలార్ మూవీ. పాన్ ఇండియన్ మూవీగా వస్తున్న ఈ సినిమా కోసం ప్రభాస్ మీసాలు పెంచి మేకోవర్ కూడా అయ్యాడు. ఇప్పుడీ మూవీకి సంబంధించి ఓ రూమర్ రౌండ్స్ కొడుతోంది.

సలార్ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కూడా పెద్ద
తరహా పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడంటూ ప్రచారం నడుస్తోంది.

దీనిపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. సలార్ లో ప్రభాస్ ది డ్యూయల్ రోల్ కాదు. కానీ డ్యూయల్ షేడ్స్ లో కనిపిస్తాడు. ఇంకా చెప్పాలంటే భాషా సినిమాలో రజనీకాంత్ టైపు అన్నమాట.

ఓ షేడ్ లో మాఫియా లీడర్ గా, మరో షేడ్ లో షెడ్ లో ఉండే మెకానిక్ గా ప్రభాస్ కనిపిస్తాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేస్తారు.