రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్ కజిన్ సిద్ధార్థ్...

Saturday,August 13,2016 - 01:21 by Z_CLU

ప్రభాస్ కజిన్ సిద్దార్థ్ హీరోగా గతంలో “బ్లాక్ & వైట్”, “ప్రియుడు” తదితర చిత్రాలను నిర్మించిన నిర్మాత పి.ఉదయ్ కిరణ్ తాజాగా మరో చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రం ద్వారా సురేష్ రేపల్లె దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సిద్ధార్థ్ గతం లో “కెరటం” అనే చిత్రం లో నటించాడు. ఇప్పుడు తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ప్రొఫెషనల్ గా మళ్ళీ ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు. “బాహుబలి” చిత్రానికి ఆపరేటివ్ కెమెరామెన్ గా పనిచేసిన బాలు కెమెరామెన్ గా పని చేయనున్నాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పెట్టనున్నారు మేకర్స్.