హాట్ టాపిక్: ప్రభాస్ మూవీ డైరక్టర్ ఇతడే!

Monday,July 13,2020 - 02:00 by Z_CLU

త్వరలోనే ఓ హిందీ సినిమా చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, హృతిక్ మల్టీస్టారర్ గా ఆ సినిమా వచ్చే ఛాన్స్ ఉందంటూ గాసిప్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడీ ప్రాజెక్టుకు సంబంధించి దర్శకుడి పేరు కూడా తెరపైకొచ్చింది.

కబీర్ ఖాన్.. భజరంగీ భాయ్ జాన్ లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమా తీసిన దర్శకుడు. ఇతడి దర్శకత్వంలోనే ప్రభాస్ స్ట్రయిట్ హిందీ మూవీ ఉంటుందని అంటున్నారు.

యాక్షన్ సినిమాలు తీయడంలో కబీర్ ఖాన్ కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఏక్ థా టైగర్, న్యూయార్క్, కాబూల్ ఎక్స్ ప్రెస్, ఫాంటమ్ లాంటి యాక్షన్ సినిమాలు ఇతడివే.

ఇప్పుడీ డైరక్టర్ హృతిక్-ప్రభాస్ ను పెట్టి మల్టీస్టారర్ తీస్తాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. అటు బాలీవుడ్ మీడియాలో కూడా ఈ కాంబినేషన్ పై ఆర్టికల్స్ వస్తున్నాయి. రాధేశ్యామ్ రిలీజ్ తర్వాత దీనిపై ప్రభాస్ ఓ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.