బాలీవుడ్ ఎంట్రీకి ప్రభాస్ రెడీ

Wednesday,September 20,2017 - 03:34 by Z_CLU

బాహుబలి-2 సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచినప్పుడే ప్రభాస్ కు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి. బాహుబలి-2 సినిమాను ప్రజెంట్ చేసిన కరణ్ జోహారే స్వయంగా ప్రభాస్ కు ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. కానీ అప్పటికే ఒప్పుకున్న కమిట్ మెంట్స్ కారణంగా ఇన్నాళ్లూ బాలీవుడ్ ఆఫర్లకు నో చెబుతూ వచ్చాడు రెబల్ స్టార్. అలా అని పూర్తిగా బాలీవుడ్ కు దూరమైపోలేదు. ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ చేశాడు.

వచ్చే ఏడాది చివరినాటికి ఓ హిందీ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఆ మూవీ 2019లో రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ మూవీ తర్వాత రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ చేయబోతున్నాడు. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుంది. వచ్చే ఏడాది ఎండింగ్ నాటికి ఈ రెండు సినిమాలు కంప్లీట్ అవుతాయి.

ఆ వెంటనే తన బాలీవుడ్ వెంచర్ ను పట్టాలపైకి తీసుకొస్తాడు ప్రభాస్. ఒకవేళ వచ్చే ఏడాది చివరి నాటికి హిందీ సినిమా స్టార్ట్ కాకపోయినా, 2019లో మాత్రం ప్రభాస్ నుంచి కచ్చితంగా ఓ బాలీవుడ్ సినిమా రావడం గ్యారెంటీ. కథ ఏదైనా, డైరక్టర్ ఎవరైనా.. ఆ మూవీకి కరణ్ జోహారే నిర్మాత అనే విషయం ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది.