‘బాహుబలి’ VS ‘సాహో’

Tuesday,May 14,2019 - 12:02 by Z_CLU

అసలు ‘బాహుబలి’కి ‘సాహో’ కి కంపారిజన్స్ ఏంటి..? ఒక్క ప్రభాస్ తప్ప ఈ రెండు సినిమాలకు అస్సలు సంబంధం లేదు. కానీ కొన్ని పర్టికులర్ విషయాలు అటు బాహుబలి, ఇటు సాహోని కంపేర్  చేసేలా చేస్తున్నాయి.

టైమ్ ఫ్రేమ్ : బాహుబలి సిరీస్ కంప్లీట్ అవ్వడానికి పట్టిన టైమ్ అక్షరాలా ఐదేళ్ళు. అంటే జస్ట్ ఒక్క బహుబలి – కంక్లూజన్ కి పట్టిన టైమ్ రెండున్నరేళ్ళు. అంటే ‘సాహో’ కి కూడా అంతే కదా. బాహుబలి కంక్లూజన్ రిలీజ్ టైమ్ లోనే ఈ సినిమా టీజర్ రిలీజైందంటే, అప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేసింది.

 

యాక్షన్ ఎలిమెంట్స్ : బాహుబలి సినిమా గురించి తలుచుకోగానే గుర్తుకొచ్చేది వార్ సీక్వెన్సెస్. ‘సాహో’లో కూడా దుబాయ్ లో తీసిన వార్ సీక్వెన్సెస్ అదిరిపోయే ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్నాయి. ఏకంగా 70 కోట్ల బడ్జెట్ ఈ  యాక్షన్ ఎపిసోడ్ కే  స్పెండ్ చేశారు మేకర్స్. బాహుబలిలో కాలకేయ ఉన్నట్టే.. సాహోలో కూడా ఓ విలన్ ఉన్నాడు.

హీరోయిన్స్ : ‘బాహుబలి’ లో హీరోయిన్లు ఇద్దరూ యుద్ధాలు చేస్తారు. తమన్న, అనుష్క ఇద్దరూ కత్తిపట్టారు. సాహోలో కూడా అంతే. ఇందులో హీరోయిన్ గా నటించిన శ్రద్ధాకపూర్, ఫైట్స్ చేసింది. ఈ సీక్వెన్సెస్ కోసం స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకుంది.

కథ: జానర్ వేరైనప్పటికీ కథలో కూడా కంపారిజన్స్ ఉన్నాయి. బాహుబలి ఓ పెద్ద డ్రామా. అదే డ్రామాకు సస్పెన్స్ కూడా యాడ్ చేస్తే సాహో అవుతుందంటున్నారు చాలామంది. బాహుబలి టైపులోనే ఈ సినిమాలో కూడా అడుగడుగునా ట్విస్టులు ఉంటాయట.

బడ్జెట్: రెండు సినిమాల బడ్జెట్ కూడా ఇంచుమించు అదే రేంజ్… బాహుబలి హాలీవుడ్ లో కూడా ఇండియన్ సినిమా మార్క్ ని రిజిస్టర్ చేస్తే, ‘సాహో’ హాలీవుడ్ స్టైల్ లో మరింత స్టైలిష్ గా తెరకెక్కుతోంది.

బాహుబలి గురించి స్పెషల్ గా  చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటికీ టాలీవుడ్ లో ఈ సినిమాది స్పెషల్ ప్లేస్. అలాంటిది ఇన్ని విషయాల్లో ‘బాహుబలి’కి సరితూగుతున్న ‘సాహో’ రిలీజ్ తరవాత అదే స్థాయి సక్సెస్ ని అచీవ్ చేస్తుందో లేదో చూడాలి.